కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన MLA

కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన MLA

ప్రకాశం: మద్దిపాడులో రూ. 5 కోట్ల వ్యాయామంతో నూతనంగా నిర్మిస్తున్నCC రోడ్లు, సైడ్ డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ శనివారం పరిశీలించారు. అలాగే మద్దిపాడు - నందిపాడు గ్రామం వరకు జరుగుతున్న తారు రోడ్డు పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ DE కృష్ణ మోహన్, నాయకులు పాల్గొన్నారు.