బంగారు మైసమ్మ దేవాలయంలో చోరీ

ఆదిలాబాద్: బెల్లంపల్లి కన్నాల జాతీయ ప్రధాన రహదారి పక్కన ఉన్న బంగారు మైసమ్మ దేవాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు గుడి తలుపులు పగలగొట్టి ప్రవేశించారు. బీరువా పగలగొట్టి అందులో ఉన్న 15 తులాల వెండి, పావుతులం బంగారం ముక్కుపుడకను ఎత్తుకెళ్లారు. అంతకుముందు దొంగలు సీసీ టీవీ కెమెరా కేబుల్‌ను కట్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.