ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

NLG: బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని సోమవారం మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంక్షేమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.