వ్యాయామంతో ఆరోగ్యం కాపాడాలి: డీపీవో
KRNL: రోజువారీ జీవితంలో గంటసేపు వ్యాయామం చేస్తే ఆరోగ్యవంతులుగా ఉండగలమని కోసిగి మండలంలో మెడికల్ క్యాంపును పరిశీలించిన డీపీవో భాస్కర్ అన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు వెల్లడించారు. అనంతరం గ్రామంలో పర్యటించి శుభ్రత, ఆరోగ్య సదుపాయాలను పరిశీలించారు.