చిల్లకూరు గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యం

చిల్లకూరు గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యం

తిరుపతి జిల్లా చిల్లకూరు గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న దాసరి హరినాథ్ అనే విద్యార్థి శనివారం ఉదయం 7 గంటల నుంచి కనిపించకుండా పోయినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిది రాపూరు మండలం, అక్కమాంబపురం గ్రామం తల్లిదండ్రులు చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.