‘రాహుల్ దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారు’
అసోం పర్యటనలో రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. మోదీని వ్యతిరేకించే క్రమంలో రాహుల్ దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఏటా రూ.150 కోట్ల వైద్య నిధులు గోల్ మాల్ అయ్యాయని ఆరోపించారు. అసోంలో రూ.2 వేల కోట్ల ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన.. పార్లమెంట్ మెట్లపై రాహుల్ తీరును తప్పుబట్టారు.