ఈతకు వెళ్లి బాలుడు మృతి

MBNR: ఈతకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదావశాత్తు మృతి చెందిన ఘటన దేవరకద్ర మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. భూత్‌పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన పద్మ, వెంకటేష్ దంపతుల కుమారుడు సన్నీ(12) వేసవి సెలవుల నేపథ్యంలో దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామానికి వెళ్లాడు. బంధువుతో కలిసి ఈతకు వెళ్లి నీళ్లు మింగి ఊపిరాడక మరణించాడు.