మెదక్‌లో స్పాట్ వ్యాలువేషన్ సెంటర్: ఎమ్మెల్యే

మెదక్‌లో స్పాట్ వ్యాలువేషన్ సెంటర్: ఎమ్మెల్యే

MDK: మెదక్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వ్యాలువేషన్ సెంటర్ మంజూరైనట్లు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల సెంటర్‌ను, మెదక్ జూనియర్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ కేటాయించిందన్నారు. ఇంటర్మీడియట్ స్పాట్ వ్యాలువేషన్‌లో భాగంగా గత ముప్పై ఏండ్లుగా ఇక్కడ ఉన్న ఇంటర్మీడియట్ లెక్చరర్ల కల నెరవేరిందన్నారు.