VIDEO: ఖమ్మం 16,19వ డివిజన్లో డ్రైనేజీ సమస్య

KMM: ఖమ్మం కార్పొరేషన్లోని 19, 16వ డివిజన్లలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు ఇళ్ళలోకి చేరి దుర్వాసన వ్యాపిస్తోందని, బోర్లలోకి మురుగు నీరు చేరడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిల్వ నీటితో దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు.