'వ్యవసాయ కార్మికులకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలి'
SRPT: వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు. ఆదివారం నాగారం మండలం ఈటూరులో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. రెక్కల కష్టం నమ్ముకుని జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.