VIDEO: ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన DEO
WGL: రాయపర్తి (M) మహబూబ్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించి, పరీక్ష పత్రాల మూల్యాంకనం చేయకుండా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు SGT ఉపాధ్యాయులు జగన్‌మోహన్, వెంకటేశ్వర్లును DEO రంగయ్య నాయుడు ఇవాళ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినందుకు చర్య తీసుకున్నట్లు DEO తెలిపారు.