శాంతి ప్రణాళికలో మార్పులు.. జెలెన్‌స్కీ స్పందన

శాంతి ప్రణాళికలో మార్పులు.. జెలెన్‌స్కీ స్పందన

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో పలు మార్పులు చేశారు. తాజాగా ఈ సవరణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. ఇప్పుడు ఆ ప్రణాళిక మెరుగ్గా ఉందన్నారు. యుద్ధం ముగింపు చర్చలు నిర్మాణాత్మకంగా జరుగుతాయని, ఇందులో ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడం, బలమైన భద్రత హామీలను పొందడం తమ ప్రాధాన్యత అని తెలిపారు.