'వరి ధాన్యం విక్రయించే వారికి సహకరించాలి'
WNP: వరి ధాన్యం విక్రయించడానికి కొనుగోళ్ళు కేంద్రాలకు వచ్చే రైతులకు నిర్వాహకులు సహకరించాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శనివారం కొత్తకోటలోని వరి కొనుగోళ్ళు కేంద్రాన్ని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోళ్ళు కేంద్రాలలోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. రైతుల దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.