VIDEO: గణేకల్లులో దేవర సందర్భంగా భారీ ట్రాఫిక్ జాం
KRNL: గణేకల్లు గ్రామంలో నిర్వహించిన గ్రామదేవత దేవర కార్యక్రమం సందర్భంగా గురువారం ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. భక్తులు, వాహనాల రద్దీతో ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. పోలీసు అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేసినప్పటికీ సమస్య తీవ్రంగానే కొనసాగింది. పలుచోట్ల వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.