మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ

MBNR: బాలానగర్ మండలంలోని ఉడిత్యాల, మోతిఘనపూర్, కేతిరెడ్డిపల్లి, బాలానగర్ గ్రామాలలో శనివారం నార్కోటిక్ సీఐ ప్రసాద్.. డ్రగ్స్, గంజాయి, ఆల్ఫాజోలం వాడకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. మందు కన్నుల్లో కలిపే ఆల్ఫాజోలం చాలా ప్రమాదకరమైనదని, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.