కల్తీ ఆయిల్‌పై అనుమానాలు.. స్పష్టతపై సందేహాలు

కల్తీ ఆయిల్‌పై అనుమానాలు.. స్పష్టతపై సందేహాలు

KMR: జిల్లాలో వంట నూనెల నాణ్యతపై అనుమానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే సూర్య గింజల నూనె, పల్లి నూనె వంటి ఉత్పత్తుల్లో కల్తీ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నూనెల తయారీలో క్రూడ్ ఆయిల్ లేదా ఇతర రసాయన పదార్థాలు ఉపయోగిస్తున్నారన్న సందేహాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.