ఏటీసీలో అడ్మిషన్లు ప్రారంభం..!

MLG: వాజేడు ప్రభుత్వ ఐటీఐలో ఏటీసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ దివాకర సూచించారు. ఏటీసీ ప్రవేశ కరపత్రాన్ని సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఈ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోర్సులో 87 సీట్లను భర్తీ చేస్తారని కలెక్టర్ అన్నారు.