ఈనెల 10లోపు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

ఈనెల 10లోపు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

NDL: ఈనెల 10లోపు శ్రీశైలం డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. రేపటి నుంచి డ్యామ్ ఇంజనీరింగ్ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏ క్షణంలో అయినా డ్యామ్ గేట్లను తెరిచే అవకాశం ఉందన్నారు.