గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

KRNL: ఆలూరు మండలం అరికేర గ్రామంలోని గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఇవాళ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల చేతుల్లో మద్యం సీసాలు, సిగరెట్లు కనిపించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ అదుపు తప్పిందని, గ్రామాల్లో బెల్ట్ షాపులు విస్తరించడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శించారు.