టీడీపీలో చేరనున్న వైసీపీ కౌన్సిలర్

టీడీపీలో చేరనున్న వైసీపీ కౌన్సిలర్

ప్రకాశం: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి అనేకమంది టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మాలకొండయ్య పేర్కొన్నారు. అలాగే చీరాల 12వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మామిడాల రాములు టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం చీరాలలో ఎమ్మెల్యే మాలకొండయ్యను రాములు మర్యాదపూర్వకంగా కలిశారు. రాములకు పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నారు.