రామగుండంలో బూడిద దందా
పెద్దపల్లి జిల్లాలో రామగుండంలోని ఎస్టీపీసీ నుంచి వెలువడుతున్న బూడిద ఇప్పుడు రాజకీయ నాయకులను బంగారు గనిగా మారింది. గతంలో ఉచితంగా తీసుకునే ఈ బూడిదను ఇటుకలు, సిమెంట్ పరిశ్రమల్లో వాడుతుండటంతో..స్థానిక నాయకులు రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే కుందనపల్లి, మొగల్పహాడ్ వంటి ప్రభావిత గ్రామాల ప్రజలు మాత్రం బూడిద వల్ల అనేక రోగాలకు గురవుతూ, పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.