ఈనెల 21న ఐఎఫ్టీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాలు
MNCL: ఈనెల 21, 22 తేదీల్లో బీహార్‌లో జరిగే ఐఎఫ్టీయూ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఐఎఫ్టీయూ దేశంలో కార్మికవర్గ సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. రెండు రోజులు జరిగే జాతీయ సమావేశాల్లో భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.