'హిందూ ధర్మంపై చైతన్యాన్ని నింపిన సత్సంగం'
RR: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో SDNR పట్టణంలోని మల్లికార్జునకాలనీలో 49వ వారం సత్సంగం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో వేద పాఠశాల అధ్యాపకులు సంగయ్యస్వామి హిరేమఠ్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో వేద మంత్రాలతో భగవాన్ నామ స్మరణతో ప్రాంగణం మారుమ్రోగింది. కార్యక్రమం హిందూధర్మంపై మరింత చైతన్యాన్ని నింపిందని నిర్వాహకులు తెలిపారు.