'ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి'
E.G: నల్లజర్ల మండలం సుభద్రపాలెంలో VB-G RAM G జాతీయ ఉపాధి హామీ పనులను టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి బొర్రా వీర వెంకట సత్యనారాయణ, జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పోలుకొండ సేతు మాధవరావు బుధవారం ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.