అమానవీయ ఘటన..చెత్త బండిలో మృతదేహం
NGKL: నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగనూల్ గ్రామానికి చెందిన కాశమ్మ మృతదేహాన్ని మున్సిపాలిటీ చెత్త బండిలో తరలించడం పలు విమర్శలకు దారితీసింది. ఈ అమానవీయ ఘటనను చూసిన స్థానికులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.