నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు: సీఐ

NGKL: నాటు సారా తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం వెల్దండ మండలంలోని జెపల్లి, పోచమ్మ గడ్డ, దొంగల గుట్ట తండాలలో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేశామని ఆయన తెలిపారు. 400 లీటర్ల బెల్లం, 14 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు.