VIDEO: రీ-సర్వేపై ఎమ్మిగనూరులో రైతుల ధర్నా

VIDEO: రీ-సర్వేపై ఎమ్మిగనూరులో రైతుల ధర్నా

KRNL: ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ రైతులు ధర్నా నిర్వహించారు. రీ-సర్వే కారణంగా భూముల్లో 20 నుంచి 50 సెంట్ల వరకు తేడాలు వస్తున్నాయని నాయకులు పంపన్న గౌడ్, రంగన్న తెలిపారు. దీనివల్ల భూములు కోల్పోతామనే ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.