పేద కక్షిదారులకే తొలి ప్రాధాన్యత: సీజేఐ
పేద కక్షిదారులకే ప్రాధాన్యత ఇస్తానని, తన కోర్టులో లగ్జరీ వ్యాజ్యాలకు చోటుండదని CJI సూర్యకాంత్ స్పష్టం చేశారు. తిలక్ సింగ్ డాంగీ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన తర్వాత ఆయన స్పందిస్తూ.. 'చివరి వరుసలో ఉన్న పేదవారి కోసం నేను ఇక్కడ ఉన్నాను. అవసరమైతే అర్ధరాత్రి వరకూ కోర్టులో కూర్చుంటాను' అని అన్నారు. సంపన్నులు వేసే అనవసర కేసులకు సమయం వృథా చేయనని వ్యాఖ్యానించారు.