నేటి నామినేషన్ వివరాలు

నేటి నామినేషన్ వివరాలు

ADB: నార్నూర్ మండలంలో శుక్రవారం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దాఖలైన నామినేషన్ వివరాలను ఎంపీడీఓ పుల్లారావు వెల్లడించారు. సర్పంచ్ స్థానాలకు 31 నామినేషన్లు దాఖలు అవ్వగా.. వార్డు స్థానాలకు 25 నామినేషన్ పత్రాలు వచ్చాయని తెలిపారు. నిన్నటితో కలిపి మొత్తం సర్పంచ్ కోసం 36, వార్డు స్థానాల కోసం 27 నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.