చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
MDK: కొల్చారం మండలంలోని సీతారాం తండాలో చేపల వేటకు వెళ్లిన ఇస్లావత్ శివరాం (45) ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందారు. ఎస్ఐ హైమద్ మొయినుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. శివరాం తన భార్య కమ్లితో కలిసి రాయకుంట సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఆయన అక్కడే ఉన్న జేసీబీ గుంతలో కాలుజారి నీటిలో మునిగిపోయారు.