సాగు నీటిని అందించాలని రైతుల ధర్నా..!

సాగు నీటిని అందించాలని రైతుల ధర్నా..!

SDPT: రంగనాయకసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ కింద ఉన్న ఎల్ఎస్ఎం - 2 కాలువ పనులు పూర్తి చేసి పంటలకు సాగునీరు అందించాలని మాచాపూర్ రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం రంగనాయకసాగర్ వద్ద ఉన్న నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వారు తెలిపారు.