'పేదల పాలిట పెన్నిధి సీఎం సహాయ నిధి'

VZM: పేదల పాలిట పెన్నిధిగా సీఎం సహాయనిధి నిలుస్తుందని నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. భోగాపురం మండలం ముంజేరులో బాధిత కుటుంబానికి రూ. 45వేలు ప్రభుత్వ సహాయనిధి చెక్కును మంగళవారం అందజేశారు. నియోజకవర్గంలో ఎంతో మంది పేదలకు సీఎం సహాయ నిధి ఆదుకుంటుందని చెప్పారు.