VIDEO: వాసవీ గణపతికి 108 రకాల మహా నైవేద్యం

KMM: సత్తుపల్లిలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో, వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, వాసవీ గణపతికి సోమవారం స్వామికి 108 రకాల వంటకాలతో మహానైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ బాధ్యులు వందనపు సత్యనారాయణ, సోమిశెట్టి శ్రీధర్, పోలిశెట్టి శివకుమార్, సత్తిబాబు, గండు ఉమ తదితరులు పాల్గొన్నారు.