ధర్మవరంలో వ్యక్తి దారుణ హత్య

ధర్మవరంలో వ్యక్తి దారుణ హత్య

అనంతపురం: ధర్మవరం పట్టణం కొత్తపేట రైల్వే స్టేషన్ ఎదురుగా శ్రీనివాస రెడ్డి(58) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు. ధర్మవరం రెండో పట్టణ పోలీసులు సంఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. హత్యకు గల కారణాల గురించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.