VIDEO:'నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి'
NTR: నందిగామ మండలంలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పరిశీలించారు. చందాపురం, కంచల, ఐతవరం, కీసర గ్రామాల్లో మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఇప్పటివరకు అధికారులు నష్టం అంచనా వేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలన్నారు.