ఉరివేసుకొని వ్యక్తి మృతి

ఉరివేసుకొని వ్యక్తి మృతి

GNTR: తుళ్లూరు టిడ్కో గృహాల్లో ఒడిశాకు చెందిన మనోజ్ (32) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమరావతి నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్న అతడు, మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.