కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ

GNTR: రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేయనున్నారు. సుల్తానాబాద్‌కు చెందిన కన్నెగంటి ఝాన్సీరాణి, ఖాజీపేటకు చెందిన పోతాబత్తిన వరుణ్ నాగ్ ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు బాధితుల నివాసాలకు వెళ్లి చెక్కులు అందజేస్తారని కార్యవర్గం వెల్లడించింది.