అక్రమంగా మధ్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు
KNR: ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు, పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు. ఆబాది జమ్మికుంటకు చెందిన బోళ్ల శంకర్ మద్యం అమ్ముతున్నాడని సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో ఇంటివద్ద రైడింగ్ చేయగా రూ. 5,790 మద్యంతో పట్టుబడినట్లు తెలిపారు. అక్రమ మద్యం అమ్మితే చర్యలు తప్పవన్నారు.