ఆ సొమ్మును దోచుకోవాలని చూస్తున్నారు: అమిత్ షా
మహిళల ఖాతాల్లో వేసిన రూ.10 వేలను ఆర్జేడీ నేతలు దోచుకోవాలని చూస్తున్నారని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. అందుకే నగదుపై ఆర్జేడీ నేతలు ఈసీ ఫిర్యాదు చేశారని తెలిపారు. లాలూ ప్రసాద్ తాతలు దిగొచ్చినా ఆ సొమ్మును దోచుకోలేరని పేర్కొన్నారు. బీహార్‌లో జంగిల్ రాజ్ తిరిగి రావద్దంటే మళ్లీ ఎన్డీయే కూటమినే గెలిపించాలని ఓటర్లను కోరారు.