అయితే జైల్.. లేకపోతే బెయిల్..: మోదీ

తప్పు చేస్తే PM, CMలనైనా తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. RJD, కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో.. లేకపోతే బెయిల్‌పై ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చురకలంటించారు. గత ప్రభుత్వాలు అవినీతిని పెంచి పోషించాయని కానీ BJP అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. అందుకే ఉద్వాసన బిల్లును తీసుకువచ్చిందన్నారు.