సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
AKP: మునగపాక మండలం ఒంపోలులో పలు చోట్ల సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో మౌలిక వసతి సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.