పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
GNTR: అప్పుల బాధలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం తక్కెళ్ల పాడు శివారులో చోటుచేసుకుంది. నూతక్కి గ్రామానికి చెందిన అద్దేపల్లి లక్ష్మి(48) ప్రస్తుతం హైదరాబాద్లో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో తక్కెళ్లపాడు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్టీఆర్ గోదాముల వద్ద పురుగుల మందు తాగి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.