తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 15 అర్జీలు

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 15 అర్జీలు

GNTR: తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులతో కలిసి ప్రజల నుంచి 15 ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూకు 5, మున్సిపాలిటీకి 5, పోలీస్‌కు 3, పంచాయితీరాజ్‌కు 1, ఇరిగేషన్‌కు 1 చొప్పున ఫిర్యాదులు అందాయని తెలిపారు. వచ్చిన అర్జీలపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.