వేములపల్లిలో నాటు సారా స్వాధీనం
ELR: లింగపాలెం మండలం వేములపల్లిలో మంగళవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. కంభం జానకమ్మ అనే మహిళ వద్ద నుంచి 1 లీటరు నాటు సారాయిని స్వాధీనం చేసుకుని, ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. ఈ సారాయిని సరఫరా చేసిన నక్తా ప్రసాద్ అనే వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ దాడులలో ఎక్సైజ్ SI అబ్దుల్ ఖలీల్ పాల్గొన్నారు.