పదో తరగతి పరీక్షకు ఎంత మంది గైర్హాజరు అంటే..!

పదో తరగతి పరీక్షకు ఎంత మంది గైర్హాజరు అంటే..!

KRNL: బండి ఆత్మకూరు మండలంలో ఇవాళ జరిగిన 10వ తరగతి భౌతిక శాస్త్ర పరీక్షకు 20 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి యశోద తెలిపారు. మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో 218 మందికి 208 మంది, ఏపీ మోడల్ స్కూల్‌లో 220 మందికి 213 మంది, సంత జూటూరు జడ్పీ హైస్కూల్‌లో 98 మందికి 95 మంది హాజరయ్యారని వివరించారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు.