రెండు రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు టెండర్ ఖరారు

SKLM: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ పరిధిలో రెండు రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు మంగళవారం టెండర్ ఖరారైనట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వేజోన్ జడ్ఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్ రంగా రౌళో తెలిపారు. ఇందులో భాగంగా ఇచ్ఛాపురం-సుర్లా రైల్వేస్టేషన్ మధ్య రూ. 2.60 కోట్లు, ఇచ్ఛాపురం–జాడుపూడి మధ్య రూ. 3.19 కోట్లతో అండర్ బ్రిడ్జి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.