VIDEO: మత్తు పదార్థాలపై షార్ట్ ఫిలిం విడుదల
KNR: గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై కరీంనగర్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక షార్ట్ ఫిలింను విడుదల చేశారు. సీపీ గౌస్ఆలం ఆదేశాల మేరకు 2వ పట్టణ సీఐ సృజన్ రెడ్డి గంజాయి సేవించే వారిని పట్టుకునే సన్నివేశాలతో ఈ వీడియోను రూపొందించారు. పోలీస్ సిబ్బందే నటించిన ఈ ఫిలింలో, గంజాయి సరఫరా చేసినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.