VIDEO: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి మృతి

JGL: వెల్గటూర్‌లో నిన్న రాత్రి RTC బస్సు గేదెను ఢీకొని అదుపుతప్పి బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇటిక్యాలకు చెందిన మేడి గణేష్(24), ముచ్చకుర్తి అనిల్(25) వెల్గటూర్ నుంచి రాయపట్నం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనిల్ అక్కడికక్కడే చనిపోగా.. గణేష్‌ను ధర్మపురి ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.