కొండపిలో ఎరువుల విక్రయాలు నిలిపివేత

ప్రకాశం: కొండపిలో శనివారం ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు పలు ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈపాస్‌లో ఎరువుల స్టాక్ నమోదు చేయనందుకు దాదాపు రూ. 5 లక్షల విలువైన ఎరువుల విక్రయాలను అధికారులు నిలిపివేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్‌మెంట్ సీఐ రాఘవరావు దుకాణదారులను హెచ్చరించారు.