డైరెక్టర్‌ను పరామర్శించిన ఆడే గజేందర్
ADB: నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన బోథ్ బ్లాక్ ఆత్మ డైరెక్టర్ సింగరపు స్వామి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ ఆయనను సోమవారం పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకుని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.